దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లిలోని సింగరేణి పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

S. Srikanth
Updated on: 2 Jan 2020 10:05 AM IST
దరఖాస్తుల ఆహ్వానం
X

భూపాలపల్లి: భూపాలపల్లిలోని సింగరేణి పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో గణితం, భౌతిక శాస్త్రం బోధించడానికి ఉపాధ్యాయులు కావాలని, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

అభ్యర్థులు డీఎస్సీ, బీఈడీ లేదా ఎమ్మెస్సీ, బీఈడీ అర్హత కలిగి ఉండి ఇంగ్లీష్ మీడియంలో బోధించాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ విద్యా సంవత్సరం చివరి తేదీ వరకు మాత్రమే పని చేయాల్సి ఉంటుందన్నారు. ముగ్గురి కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థికి నెలకు రూ. 17,500 చెల్లిస్తామన్నారు. అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

S. Srikanth

S. Srikanth

Next Story