హైదరాబాద్ లో 18,20 తేదీల్లో జనసేన సమావేశాలు

K V D Varma
Published on: 16 Oct 2019 10:48 PM IST
హైదరాబాద్ లో 18,20 తేదీల్లో జనసేన సమావేశాలు
X

జనసేన పార్టీ పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 18,20 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని ఆయన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

18వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం, 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలనా తీరుతెన్నులు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తారని అయన వెల్లడించారు.


K V D Varma

K V D Varma

Next Story