బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే..

BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది.

Arun Chilukuri
Published on: 24 Jun 2024 11:05 AM IST
Jagtial BRS MLA Sanjay Kumar Joins Congress
X

బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే..

BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ గూటిలో చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రెండ్రోజుల క్రితమే మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరుకుంది. సంజయ్‌కుమార్‌ 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

తిరిగి 2018లో మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి అదే జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే మరోసారి గెలుపొందారు. అయితే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పార్టీలో సీనియర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లాలో రాజకీయం మలుపుతిరిగే అవకాశముంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story