Assembly: అసెంబ్లీ దగ్గర జగ్గారెడ్డి నిరసన

Assembly: తమకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని అసెంబ్లీకి పాదయాత్ర * ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం

Sandeep Eggoju
Published on: 25 March 2021 11:49 AM IST
Jaggareddy Protest at Assembly
X
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

Assembly: అసెంబ్లీ దగ్గర సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన తెలిపారు. ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ ట్యాంక్ బండ్‌ నుంచి పాదయాత్రగా వెళ్లారు జగ్గారెడ్డి. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్లారు. అలాగే లోనికి కూడా వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ప్లకార్డులు ఉంటేనే లోనికి వెళ్తానని గేటు దగ్గరే బైఠాయించారు జగ్గారెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story