Jagga Reddy: టీఆర్ఎస్ నుంచి టీ తొలగించి తెలంగాణను అవమాన పరిచారు

Jagga Reddy: కేసీఆర్ ఏపీ వెళుతున్నాడు కాబట్టి బాబు ఇక్కడికొస్తున్నాడు

Jyothi
Published on: 26 Dec 2022 1:32 PM IST
Jagga Reddy Comments On CM KCR
X

Jagga Reddy: టీఆర్ఎస్ నుంచి టీ తొలగించి తెలంగాణను అవమాన పరిచారు 

Jagga Reddy: తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని, కేసీఆర్ పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి టీ తొలగించి తెలంగాణను అవమానించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఏపీకి వెళుతున్నాడు కాబట్టి చంద్రబాబు తెలంగాణకు వచ్చారని ఆయన అన్నారు. సైలెంట్‌గా ఉన్న బాబు తెలంగాణకు రావడానికి కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరని, కానీ తెలంగాణను అట్రాక్ట్ చేయగలరని చెప్పుకొచ్చారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. కేసీఆర్‌లో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందని ఆరోపించారాయన చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారని, కూటములు, పొత్తులపై మున్ముందు తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని, మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్ఎస్ వెళితే టీడీపీ కూడా వెళుతుందన్నారు.

Jyothi

Jyothi

Next Story