Weather Report: హైదరాబాద్‌లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం.. మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన

It Has Been Raining Since Night In Hyderabad And Forecast For Two More Days
x

Weather Report: హైదరాబాద్‌లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం.. మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన

Highlights

Weather Report: కోనసీమ, గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో భారీవర్షాలు

Weather Report: ఏపీలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజులుగా వానలు పడుతున్నాయి. ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది వాతావరణశాఖ. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల గాలులు వీస్తాయంటున్నారు.

ఇవాళ పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

విజయనగరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ, గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. నిన్న ఉదయం నుంచి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. ఈ వానలతో వ్యసాయం పనుల్ని రైతులు ముమ్మరం చేశారు. ఏపీలో గతవారం విభిన్నమైన వాతావరణం కనిపించింది.. ఎండలు మళ్లీ మండిపోయాయి.. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నాలుగైదు రోజులు అదే పరిస్థితి కొనసాగింది. అక్కడక్కడ మాత్రం మధ్యాహ్నం వరకు ఎండలు ఉండగా.. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా వర్షం పడటంతో జనాలు సేద తీరారు.

ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఆవర్తనం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశనుంచి తెలంగాణ మీదుగా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అక్కడక్కడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. రాత్రి హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories