Telangana: ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ కన్నుమూత

Telangana: గుండెపోటుతో మృతిచెందిన రాజీవ్‌ రతన్‌

Jyothi
Published on: 9 April 2024 10:05 AM IST
IPS officer Rajiv Ratan passed away
X

Telangana: ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ కన్నుమూత 

Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. హార్ట్ ఎటాక్‌ రావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్.. ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. గతేడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్ బాస్ రేస్‌లో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. రాజీవ్ రతన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story