KCR: తెలంగాణలో రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది

KCR: తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

Shekhar G
Published on: 3 March 2024 5:49 PM IST
Interesting Comments Of KCR In The Meeting Of Lok Sabha Leaders In Karimnagar
X

KCR: తెలంగాణలో రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది

KCR: తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. అయితే.. ఇవాళ అష్టమి ఉండటంతో.. రేపు కొంతమంది బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులను గులాబీ అధిష్టానం ప్రకటించనుంది. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌ లోక్‌సభ నేతల సమావేశంలో కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, తెలంగాణలో రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి దాపరించిందన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందనే టాక్‌ ప్రజల్లో మొదలైందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని నేతలకు సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా నేతలంతా కలిసికట్టుగా కష్టపడాలని అన్నారు. ఇక.. ఈ నెల 12న కరీంనగర్‌ SRR డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరుగుతుందని, ఉద్యమకాలం నుంచి సెంట్‌మెంట్‌గా వస్తున్న SRR కాలేజీ గ్రౌండ్స్‌లోనే సభ జరగబోతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story