TS: ప్రాణం తీసిన నిమిషం నిబంధన .. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

TS: మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న శివకుమార్

Shekhar G
Published on: 29 Feb 2024 12:50 PM IST
Inter Student Lifes Ends Due To Not Attending Inter Exam In Telangana
X

TS: ప్రాణం తీసిన నిమిషం నిబంధన .. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

TS: తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఓ విద్యార్థి ప్రాణం తీసుకునేందుకు కారణమైంది. పరీక్ష రాయడానికి అనుమతించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా మాంగుర్లలో జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శివకుమార్ బుధవారం ఎగ్జామ్ రాసేందుకు వెళ్లాడు. అయితే ఎగ్జామ్‌ సెంటర్‌కు ఆలస్యంగా చేరుకోవడంతో ఇన్విజిలేటర్లు అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి స్నాత్నాల ప్రాజెక్టులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సూసైడ్ స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీని వెలికితీశారు. విద్యార్థి సూసైడ్ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సూసైడ్ స్పాట్‌లో విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌ లభించింది. క్షమించు నాన్నా అంటూ లేఖ రాసి చనిపోయాడు. తన వల్ల కావడంలేదని, బాధను భరించలేకపోతున్నాని తెలిపాడు. ఎగ్జామ్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉందంటూ సూసైడ్ నోట్ రాశాడు.

Shekhar G

Shekhar G

Next Story