Hyderabad: బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని..

Student Suicide: బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Oct 2024 11:59 AM IST
Inter Student Commits Suicide in Narayana College
X

బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని..

Student Suicide: బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష దసరా సెలవులకు వెళ్లి... తిరిగి హాస్టల్‌కు వచ్చి సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు దగ్గరుండి హాస్ట‌ల్‌లో వదిలి వెళ్లిన కాసేపటికే బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్‌లో వదిలి.. సిటీ దాటే లోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది.

అయితే వారు కాలేజీకి వెళ్లే సరికి అనూష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story