Telangana: ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు తర్జనభర్జన

Telangana: కరోనా మహహ్మరి ఎఫెక్టు తో ఈ విద్యా సంవత్సరం కూడా అతలాకుతలమవుతోంది.

Arun Chilukuri
Published on: 29 March 2021 2:48 PM IST
Inter Practical Exams Likely to be Cancelled in Telangana
X

Telangana: ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు తర్జనభర్జన 

Telangana: కరోనా మహహ్మరి ఎఫెక్టు తో ఈ విద్యా సంవత్సరం కూడా అతలాకుతలమవుతోంది. గత ఏడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఈ సారి కూడా ఎగ్జామ్స్ జరుగుతాయ లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు ముందే ప్రకటించారు. అయితే, ప్రాక్టికల్స్ ఉంటాయా లేదా అన్నదానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతతో పాటు పరీక్షలను వాయిదా వేశారు. ఈ సారి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ రద్దు చేసి కేవలం వార్షిక పరీక్షలు నిర్వహించే యోచనలో ఇంటర్ బోర్డు ఉంది.

గత ఏడాది జూన్ లో ప్రారంభం కావాల్సిన ఇంటర్ క్లాసులు, ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 24 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే ఒకటి నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. కాలేజీల మూసివేతతో తగిన సమయం లేనందున ఇంటర్ ప్రాక్టికల్స్ రద్దు చేసి నేరుగా వార్షిక పరీక్షలు నిర్వహించే యోచనలో అధికారులు ఉన్నారు.

ఇంటర్ మార్కుల ఆధారంగా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంట్రెన్స్ ఎగ్లామ్స్ ఉంటాయి. థియరీ ఎగ్జామ్స్ లేకుండా అందరినీ వెయిటేజ్ ప్రకారం పాస్ చేస్తే, మార్కుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో సెకండియర్ స్టూడెంట్స్ కు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story