Khammam Lok Sabha Ticket: ఖమ్మం ఎంపీ స్థానానికి తీవ్రపోటీ.. టికెట్ కోసం కీలక నేతల కుటుంబీకుల ప్రయత్నాలు

Khammam Lok Sabha Ticket: మల్లు నందినికే టికెట్ ఇవ్వాలంటోన్న భట్టి అనుచరులు

Shekhar G
Updated on: 3 Feb 2024 1:46 PM IST
Intense competition for Khammam MP seat
X

Khammam Lok Sabha Ticket: ఖమ్మం ఎంపీ స్థానానికి తీవ్రపోటీ.. టికెట్ కోసం కీలక నేతల కుటుంబీకుల ప్రయత్నాలు

Khammam Lok Sabha Ticket: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు హాట్‌సీట్‌గా మారిన ఖమ్మంలో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మేమంటే మేం పోటీ చేస్తామంటూ నేతల దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఖమ్మం స్తానానికి దరఖాస్తు చేసేందుకు భారీ ర్యాలీ ప్లాన్ చేశారు నందిని. భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ ‌నుంచి 5 వందల కార్లతో ర్యాలీ నిర్వహించి దరఖాస్తు చేసుకోనున్నారు మల్లు నందిని.

మల్లు నందినితో పాటు ఖమ్మం బరిలో దిగేందుకు కీలక నేతలు రెడీగా ఉన్నారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, వీహెచ్‌ ‌ఖమ్మం స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ కూడా టికెట్ డిమాండ్‌ చేస్తోంది. అయితే మల్లు నందినికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భట్టి అనుచరులు.

Shekhar G

Shekhar G

Next Story