Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ కార్ రేస్

Hyderabad: ఇవాళ, రేపు పెట్రోల్ కార్లతోనే కార్ రేస్.. రేసింగ్‌లో పాల్గొననున్న 12 కార్లు, 6 బృందాలు, 4 డ్రైవర్లు

Jyothi
Updated on: 19 Nov 2022 2:06 PM IST
Indian Racing League Car Race in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ కార్ రేస్

Hyderabad: తెలంగాణతో పాటు.. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఫార్ములా రేస్.. ఇండియన్ రేసింగ్ లీగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా రేస్ కార్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లబోతున్నాయి. ఇందులో ఆరు ప్రధాన నగరాల నుంచి ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 12 కార్లు ట్రాక్‌పై రయ్ మని దూసుకెళ్లనున్నాయి. ఇండియాలో ఇదే తొలి స్ట్రీట్ సర్క్యూట్. ఇందుకు విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ వేదిక కావడం తెలుగు వారికి ప్రత్యేకం. ఇవాళ, రేపు జరిగే ఈ రేస్‌‌లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది.

Jyothi

Jyothi

Next Story