కబ్జా చేసి భారీ నిర్మాణం.. బిల్డింగ్‌ను కూల్చివేయాలని హైడ్రా కమీషనర్ రంగనాధ్ ఆదేశాలు

AV Ranganath: బిల్డింగ్‌ను కూల్చివేయాలని రంగనాధ్ అధికారులకు ఆదేశాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2024 3:31 PM IST
HYDRA Commissioner AV Ranganath visit to Vanasthalipuram
X

AV Ranganath: వనస్థలిపురంలో హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పర్యటన

AV Ranganath: హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆఫీసర్స్ కాలనీలో హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పర్యటించారు. కాలనీ లే అవుట్ లోని ఓపెన్ స్పెస్‌లో ఓ వ్యక్తి 400 గజాల స్థలాన్ని కబ్జాచేసి భారీ నిర్మాణం చేశాడు. బిల్డింగ్‌ను కూల్చివేయాలని కమీషనర్ రంగనాధ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రకేసరి నగర్‌లోని బతుకమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. హయత్ నగర్ లోని హత్తిగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story