అల్లుడిని కత్తితో పొడిచి చంపిన అత్త

Arun Chilukuri
Updated on: 29 Oct 2020 1:41 PM IST
అల్లుడిని కత్తితో పొడిచి చంపిన అత్త
X

అల్లుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనితా తన కుమార్తె వందనను నవీన్ కిచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేసింది. ఐతే పెళ్లైన నెలకే వందన ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో నవీన్ పై మీర్ పేట్ పీఎస్ లో అనిత కేసు పెట్టింది. భార్య ఆత్మహత్య కేసులో న‌వీన్‌ జైలుకు వెళ్లాడు. ఇటీవ‌లే న‌వీన్ జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. విష‌యం తెలుసుకున్న అత్త అనిత‌ తన ఇంటికి వచ్చి అల్లుడిపై క‌త్తితో దాడి చేసి చంపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనలు అన్నింటికి వివాహేతర సంబంధాలే కారణంగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story