Vidyasagar Rao: హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది

Hyderabad Will Become Second Capital of India Says Vidyasagar Rao
x

Vidyasagar Rao: హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది

Highlights

Vidyasagar Rao: బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Vidyasagar Rao: బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు. ‍హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని.. రాజ్యాంగంలో కూడా ఈ అంశం ఉందని తెలిపారు. ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసి వచ్చి చర్చ జరపాలని పిలుపునిచ్చారు విద్యాసాగర్ రావు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని తెలిపారు. బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ లను కలిపి ఒక స్టేట్ గా చేసి, దాన్ని దేశ రెండో క్యాపిటల్ చేయాలని అంబేద్కర్ చెప్పారని అన్నారు. హైదరాబాద్ రెండో క్యాపిటల్ కావడం మన దేశ భద్రతకు మంచిదని పేర్కొన్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories