దిశ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తుది నిర్ణయం

Arun Chilukuri
Updated on: 4 Dec 2019 4:06 PM IST
దిశ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తుది నిర్ణయం
X

దిశ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్‌ కోర్టు ఇవాళ తుది నిర్ణయం ప్రకటించనుంది. శాంతి భద్రతల దృష్ట్యా నలుగురు నిందితులను చర్లపల్లి జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చర్లపల్లి జైలు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ సిద్ధం చేసుకోవాలని షాద్‌నగర్‌ కోర్టు సూచించినట్లు సమాచారం.

దిశ కేసులో నిందితులకు షాద్‌నగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేసి, వారి సంతకాలు తీసుకున్నారు. నిందితుల సంతకాలతో ఉన్న పేపర్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రేపు కోర్టు తీర్పు అనంతరం, నలుగురు నిందితులను షాద్‌నగర్‌ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. కస్టడీ పిటిషన్‌పై నిందితుల సమాచారం గోప్యంగా ఉంచుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story