వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్‌.. చలాన్‌లపై డిస్కౌంట్‌...

Traffic Police - Challan Discount: *బైక్స్‌, త్రీ వీలర్స్‌కు 75 శాతం రాయితీ *ఆర్టీసీ బస్‌లకు 70 శాతం రాయితీ

Shireesha
Updated on: 1 March 2022 7:30 AM IST
Hyderabad Traffic Police Bumper Offer is Discount on Challans | Breaking News Today
X

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్‌.. చలాన్‌లపై డిస్కౌంట్‌...

Traffic Police - Challan Discount: కొద్ది రోజుల క్రితమే వాహనదారులకు హైదరాబాద్‌ పోలీసులు బంపర్ ఆఫర్‌ ప్రకటించారు. ఈ-లోక్ అదాలత్‌ ద్వారా వాహనదారులు తమ పెండింగ్‌ చలానాలను రాయితీతో చెల్లించుకోవచ్చాన్నారు. నేటి నుంచి మార్చి 30వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేటీఎం, గూగుల్‌ పే వంటి యాప్స్‌ను ఉపయోగించి కూడా పెండింగ్ చలాన్‌లను క్లియర్‌ చేసుకోవచ్చని తెలిపారు.

అదేవిధంగా కోవిడ్‌ మాస్క్‌ కేసుల్లో వేయి రూపాయలకుగాను కేవలం వంద మాత్రమే కడితే సరిపోతుందని వెల్లడించారు. పేదవర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈవెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ప్రతీ చలాన్‌ను మీ సేవా, ఆన్‌లైన్‌ ద్వారా, తెలంగాణ ఈ చలాన్‌ ద్వారా పే చేయవచ్చన్నారు. టూ, త్రీ వీలర్స్‌కు 75 శాతం, ఆర్టీసీ బస్‌లకు 70 శాతం.. కార్లు, భారీ వాహనాలకు 50 శాతం రాయితీ విధించారు. ఇక ఒక్క హైదరాబాద్‌లోనే 500 కోట్ల పెండింగ్‌ చలాన్‌లు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story