Ram Navami Shobha Yatra 2023: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర

Shobha Yatra: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 30 March 2023 4:41 PM IST
Hyderabad Sri Rama Navami Shobha Yatra Underway
X

Ram Navami Shobha Yatra 2023: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర

Shri Ram Navami Shobha Yatra: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ధూల్‌పేట్‌ చౌరస్తాకు శోభాయాత్ర చేరుకుంది. జైశ్రీరామ్‌ నినాదాలతో ధూల్‌పేట్‌, పురానాపూల్‌ పరిసరాలు మార్మోగుతున్నాయి. ఇక.. సీతారామ్‌బాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర.. సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనుంది. ఆరున్నర కిలోమీటర్ల మేర సాగనున్న ఈ శోభాయాత్రకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా నీడలో శోభాయాత్ర సాగుతోంది. మరోవైపు శోభాయాత్ర నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story