చిప్ తో పెట్రోల్ నొక్కేస్తున్నారు.. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల ఘరానా మోసం !

Arun Chilukuri
Updated on: 5 Sept 2020 11:05 AM IST
చిప్ తో పెట్రోల్ నొక్కేస్తున్నారు.. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల ఘరానా మోసం !
X

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటీ పోలీసుల దాడులు జరిపారు. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్ గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్ ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు. అలా చేస్తున్న హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని 26 బంక్ లను కూడా ఏపీ పోలీసులు సీజ్ చేశారు.

ప్రత్యేక చిప్‌లను బంకు యజమానులు మహారాష్ట్ర నుండి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇది ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. పెట్రోల్ బంకులలో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుండి ప్రత్యేకంగా చిప్‌లను తెప్పించుకున్న బంక్ నిర్వాకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పెట్రోల్ బంకులు అమర్చుకున్నారు. దీని ద్వారా కోట్ల రూపాయలను మోసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story