వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌.. మీ పెండింగ్​ చలాన్లు ఇపుడే చెల్లిస్తే 75 శాతం డిస్కౌంట్..

Hyderabad Police Offer Discount on Traffic Challans
x

వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌.. మీ పెండింగ్​ చలాన్లు ఇపుడే చెల్లిస్తే 75 శాతం డిస్కౌంట్..

Highlights

Traffic Challans: హైదరాబాద్‌లో పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనదారులకు పోలీస్‌ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Traffic Challans: హైదరాబాద్‌లో పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనదారులకు పోలీస్‌ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ చేసేందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. భారీ స్థాయిలో రిబేట్‌ ప్రకటించిన పోలీస్‌శాఖ.. టూ వీలర్‌ వాహనదారులు 25శాతం చెల్లింపునకు అవకాశం కల్పించింది. మిగతా 75 శాతాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది.

ఇక.. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం చెల్లింపునకు ఛాన్స్‌ ఇచ్చింది. మీ సేవా, ఆన్‌లైన్‌ గేట్‌వేల ద్వారా పెండింగ్ చలాన్లు కట్టేందుకు వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో మొత్తం 600 కోట్లకు పైగా పెండింగ్‌ చలాన్లు ఉండటంతో.. మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్‌ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories