మందు బాబులకు షాక్.. రెండు రోజుల పాటు బార్లు, వైన్స్‌లు బంద్!

Hyderabad Police Notify Rules for Holi Festivities
x

మందు బాబులకు షాక్.. రెండు రోజుల పాటు బార్లు, వైన్స్‌లు బంద్!

Highlights

Wine Shops In Hyderabad: హోళీ పండుగ నేపథ్యంలో పోలీసులు మందు బాబుల‌కు షాక్ ఇచ్చారు.

Wine Shops In Hyderabad: హోళీ పండుగ నేపథ్యంలో పోలీసులు మందు బాబుల‌కు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ మహా నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆ ఆంక్షలు అమలులొకి రానున్నాయి.

రాజధాని పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories