Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

Hyderabad:పాతబస్తీలో దారుణం జరిగింది. పిల్లలు కలగడం లేదనే అక్కసుతో 3ఏళ్ల బాలుడిని బిల్డింగ్ పై నుంచి విసిరేసింది ఓ మహిళ.

Venkata Chari
Published on: 2 March 2021 8:32 PM IST
Hyderabad Old City Women Assasinated 3 Years Old Boy
X

ఫోటో ట్విట్టర్ 

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు పిల్లలు కలగడం లేదనే అక్కసుతో మూడేళ్ల బాలుడిని బిల్డింగ్ పై నుంచి విసిరేసింది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ భవాని నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఈది బజార్ కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన అయేషా, అహ్మద్ ఉద్దీన్‌లకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరికి ఇంకా పిల్లలు పుట్టలేదు.

ఈ నేపథ్యంలో మంగళవారం తన భర్త తమ్ముడి కుమారుడు వరుసకు మేనల్లుడైన మూడేళ్ల నుమాన్ ఉద్దీన్‌ తన ఇంటికి తీసుకొచ్చింది. కొద్దిసేపటి తరువాత ఆడుకునేందుకు భవనంపైకి తీసుకెళ్లింది. ఉన్నట్టుండి బిల్డిండ్ పైనుంచి కిందకు విసిరేసింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి నుమాన్ అక్కడిక్కడే మరణించాడు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలు అయేషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story