Hyderabad: హైదరాబాద్‌లో రేపట్నుంచి ఎంఎంటీఎస్‌ సర్వీసులు

Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే బోర్డు * సీజనల్‌ టికెట్ల గడువు పొడిగిస్తూ నిర్ణయం

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 7:31 PM IST
Hyderabad MMTS Trains Starts From Tomorrow
X

హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Hyderabad: హైదరాబాద్‌లో రేపటి నుంచి ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనాతో ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీసులను వినియోగించుకోలేపోయిన ప్రయాణికులకు సీజనల్‌ టికెట్ల గడువును పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎంఎంటీఎస్‌ సీజనల్‌ టికెట్లతో నష్టపోయిన రోజులను ఇప్పుడు పొడిగించుకునే అవకాశం కల్పించింది. అలాగే.. నగదు రహిత టికెట్ల కొనుగోలుపై ప్రయాణికులకు అదనంగా 5శాతం బోనస్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే బోర్డు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story