కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

Hyderabad: సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరనున్న మేయర్

Jyothi
Updated on: 23 March 2024 9:30 AM IST
Hyderabad Mayor Gadwal Vijayalakshmi To Congress Party?
X

కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

Hyderabad: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మేయర్ విజయలక్ష్మితో పాటు పది మంది కార్పొరేటర్లు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నిన్న విజయలక్ష్మి నివాసంలో కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డిలు సమావేశం అయ్యారు.

కాంగ్రెస్‌లోకి రావాలని దీపదాస్ మున్షీ గద్వాల విజయలక్ష్మిని ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతానని, రెండు సార్లు తనను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని విజయలక్ష్మి చెప్పినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కే. కేశవరావు కుమార్తె. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఆమె విజయం సాధించారు. 2021లోనూ రెండోసారి గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్ అయ్యారు.

Jyothi

Jyothi

Next Story