Hyderabad Girl got international wonder book of record : వహ్..వాటే వండర్ గర్ల్

Hyderabad Girl got international wonder book of record : వహ్..వాటే వండర్ గర్ల్
x
Highlights

Hyderabad Girl got international wonder book of record : చాలా మంది విద్యార్ధుల్లో తమకు తెలియకుండానే ఎన్నో కళలు దాగి ఉంటాయి. కానీ అవన్నీ కొన్ని...

Hyderabad Girl got international wonder book of record : చాలా మంది విద్యార్ధుల్లో తమకు తెలియకుండానే ఎన్నో కళలు దాగి ఉంటాయి. కానీ అవన్నీ కొన్ని సందర్భాల్లోనే బయటికి వస్తాయి. వారి వయసుతో సంబంధం లేకుండా తమ తెలివితేటలను ఉపయోగించి గొప్ప విజయాలను సాధింది కీర్తి సంపాదించుకుంటారు. ఎదుటివారు ఆహా అని అబ్బురపోయే పనులను చేసి ఆశ్చర్యానికి గురి చేస్తారు. చిన్న వయసులోనే అలాంటి ఓ పనిని చేసి ఘనతను దక్కించుకుంది ఓ విద్యార్ధిని. అసలు ఎవరు ఆ బాలిక, ఏం చేసింది ఇప్పుడు వివరాల్లోకెళెదాం.

శ్రీలిఖిత అనే ఓ బాలిక హైదరాబాద్ వనస్థలిపురంలోని అన్నపూర్ణ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 8వ తరగతి చదవుతున్న అమ్మాయి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. తన కళ్లకు గంతలు కట్టుకుని స్‌ బోర్డు అరేంజ్‌మెంట్‌ ను కేవలం 40 సెకన్లలో చెపూర్తి చేసింది. అది చూసిన ఇంటర్నేషనల్‌ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ఆమెను మెచ్చుకుని ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందిజేశారు. సోమవారం హైదర్‌గూడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీలిఖిత ఈ ఘనత సాధించింది. ఇక పోతే శ్రీ లిఖిత ఇప్పటికే చెస్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరచి ఎన్నో టోర్నమెంట్లలో పతకాలు సాధించింది. మెదడుకు మేత పెడుతూ చెస్ టోర్నమెంట్లలో ఇప్పటికే ఎన్నో పతకాలను సాధిస్తూ ప్రస్తుతం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించడంతో ఆమె తల్లిదమడ్రులు ఆనందం వ్యక్తం చేసారు. భవిష్యత్‌లో గ్రాండ్‌మాస్టర్‌గా నిలవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది శ్రీ లిఖిత.

Show Full Article
Print Article
Next Story
More Stories