హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
x
Highlights

భాగ్యనగరానికి అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచంలో 66 నగరాల సరసన, దేశంలోని 18 నగరాలతో పోటీపడి ముంబాయి తో పాటు ఈ జాబితాలో నిలిచింది.

హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రపంచంలోని క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు దక్కింది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాల ప్రాతిపాదికన 66 నగరాలను క్రియేటివ్ సిరీస్ నెట్ వర్క్ కింద ఎంపిక చేసింది. వాటిలో హైదరాబాద్ ఒకటి గా నిలిచింది. భారతదేశంలో కేవలం రెండు నగరాలు మాత్రమే ఈ జాబితా లో చేరగాలిగాయి. హైదరాబాద్ తో పాటు ముంబైకి ఇందులో చోటు దక్కింది.

భార‌త‌దేశం నుంచి మొత్తం 18 న‌గ‌రాలు ఈ జాబితాలో స్థానం కోసం పోటీపడగా వాటిలో కేవ‌లం నాలుగు న‌గ‌రాలు హైద‌రాబాద్‌, ముంబై, శ్రీన‌గ‌ర్‌, ల‌క్నోమాత్రమే చివరి వరకు పోటీలో నిలిచాయి. అయితే, చివరకు భారత్ నుంచి మన హైద‌రాబాద్‌తో పాటు ముంబై మహాన‌గ‌రం ఎంపికైంది. ముంబైని సినిమా కేటగిరీలో ఎంపిక చేయగా.. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి ఎంపిక‌ చేశారు.

యునెస్కో క్రియేటీవ్ సిటీస్ నెట్‌వ‌ర్క్‌లో హైదరాబాద్ చోటు దక్కించుకోవడం పట్ల మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ సిటీస్ డే సందర్భంగా ఈ గుర్తింపు దక్కడం హర్షనీయమని ఆయన ట్వీట్ చేశారు. జీహెచ్‌ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్‌ కుమార్‌ కూడా హ‌ర్షం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories