హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్

X
Highlights
హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. ముఖ్యమత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా ...
Arun Chilukuri19 Dec 2020 10:07 AM GMT
హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. ముఖ్యమత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా ప్రతినెలా 20 వేల లీటర్ల తాగు నీరు ఉచితంగా పంపిణీ చుయనున్నట్లు తెలిపారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణపై ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులకు జనవరిలో వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Web TitleHyderabad: free water scheme inaugurated in 2021 January says minister ktr
Next Story