కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా..

కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా..
x
Highlights

హైదరాబాద్‌లో వరద సాయంపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో అసాధారణ వర్షపాతం ఈ ఏడాది నమోదైందన్న కేటీఆర్...

హైదరాబాద్‌లో వరద సాయంపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో అసాధారణ వర్షపాతం ఈ ఏడాది నమోదైందన్న కేటీఆర్ ఇలాంటి ఘటనలకు మానవ తప్పిదాలే కారణమని అన్నారు. దశాబ్దాలుగా చెరువులు, నాలాలు కబ్జా చేశారని ఫలితంగా వందలాది కాలనీలు నీటమునిగాయన్నారు. వర్షాలు పడుతుండగానే కేసీఆర్ వరద సాయం అందించారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

వరద బాధితులకు తక్షణ సాయంగా 550 కోట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని 4 లక్షల 30వేల కుటుంబాలకు 10వేలు చొప్పున సాయం అందించామన్నారు. వరద సాయం కూడా తీసుకుని కొంతమంది చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ప్రాణ నష్టాన్ని చాలావరకు తగ్గించామని ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించామన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు స్పెషల్‌ ఫోర్స్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

వరద సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు మంత్రి కేటీఆర్. మేం వరద సాయంలో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీలు దుబ్బాకలో ఓట్లు దండుకునే పనిలో ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన వరదలపై సీఎం కేసీఆర్‌ మోడీకి లేఖ రాశారని వరద సాయం ప్రకటించాలని కోరారని తెలిపారు. ఇక్కడున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా..? అంటూ విమర్శించారు. బీజేపీ ఎంపీలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. మోడీకి బీజేపీ పాలిత ప్రాంతాలపై ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని అన్నారు మంత్రి కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories