సిద్దం అవుతున్న సిటీ బస్సులు

సిద్దం అవుతున్న సిటీ బస్సులు
x
Highlights

హైదరాబాద్ లో లాక్ డౌన్ తో డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు అన్ లాక్తో ఏ క్షణానైనా రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నాయి. సోమవారం నుంచి మెట్రో...

హైదరాబాద్ లో లాక్ డౌన్ తో డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు అన్ లాక్తో ఏ క్షణానైనా రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నాయి. సోమవారం నుంచి మెట్రో రీస్టార్ట్ అవడంతో సిటీ బస్సులకు కూడా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన వెంటనే బస్సులు నడిపేందుకు వీలుగా రిపేర్, సర్వీసింగ్ పనులు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో 29 డీపోల పరిధిలో 3,700 బస్సులు ఉన్నాయి. ఇప్పటికే అందులో కొన్నింటిని కార్గో సర్వీసులకు ఉపయోగిస్తున్నారు. అవిపోగా, మిగిలిన వాటితో తిరిగి పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రారంభించనున్నారు. మెట్రో పునః ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం బస్సులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని భావించి ముందస్తుగా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇంజిన్ కండిషన్, రిపేర్లు, విడి భాగాల ఫిట్టింగ్, ప్యాసింజర్లు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆరు నెలల సమయంలో చిన్నాచితిక సమస్యలను కూడ మరమత్తులు చేసి పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే బస్సులు అప్పటికప్పుడే తిప్పడానికి ఆర్టీసీ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారు.

ప్రభుత్వం మెట్రో విషయంలో చూపిన చొరవ ఆర్టీసీ బస్సుల విషయంలో చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మెట్రో ప్రయాణానికి కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విధివిధానాలను ప్రకటించారు. కాని ఆర్టీసీలో సిటీ బస్సులకు సంబంధించిన విధివిధానాలపై అధికారులు ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. సమ్మే తర్వాత ఆర్టీసీని స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తుండడంతో సీఎం అనుమతి కోసం ఆర్టీసీ ఉన్నతాదికారులు ఎదురుచూస్తున్నారు. నగరంలో గత ఆరు నెలలుగా బస్సులు తిరగకపోవడంతో శివారు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మెట్రో ప్రారంభమైనప్పటికీ ఇతర ప్రాంత ప్రజలకు బస్సులే దిక్కు. కాబట్టి ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకొవాల్సిన అవసరముంది.


Show Full Article
Print Article
Next Story
More Stories