పెళ్లయిన 20 రోజులకే ఘోరం.. భర్తను..

Arun Chilukuri
Published on: 12 Sept 2020 9:26 AM IST
పెళ్లయిన 20 రోజులకే ఘోరం.. భర్తను..
X

భర్త వేధింపులు భరించలేక ఓ కొత్త పెళ్లి కూతురు అతన్ని కడతేర్చింది. పెళ్లైన 20 రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జిర్రా ముజాహీద్‌నగర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. టప్పాచబుత్ర పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫర్నీచర్‌ దుకాణంలో పనిచేసే మహ్మద్‌ అస్లాం(25) ముజాహిద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి సమ్రీన్‌(22)తో 20 రోజుల క్రితం వివాహమైంది. శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో సమ్రీన్‌ రోకలిబండతో అస్లాం తలపై బలంగా కొట్టింది. స్థానికులతో కలిసి అస్లాం తండ్రి బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అస్లాం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story