ఖైరతాబాద్ గణపతికి పోటెత్తిన భక్తులు.. భక్తుల రద్దీతో తోపులాట.. బారికేడ్లను తొలగించిన అధికారులు

Huge Rush of Devotees at Khairatabad Ganesh Pandal
x

ఖైరతాబాద్ గణపతికి పోటెత్తిన భక్తులు.. భక్తుల రద్దీతో తోపులాట.. బారికేడ్లను తొలగించిన అధికారులు

Highlights

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఖైరతాబాద్ గణపతి దగ్గర భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బారీకేడ్లను తొలగించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. తాడు సాయంతో భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తూ దర్శనం కల్పిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరోవైపు సీసీ కెమెరాల్లో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రద్దీని కంట్రోల్ చేస్తున్నారు.

ఈసారి 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ మహా గణపతి. కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరారు. భక్తులకు లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories