House Owner Against Corona Patients: కరోనా పేషంట్లపై వివక్ష చూపుతోన్న ఇంటి యజమానులు

Arun Chilukuri
Published on: 30 July 2020 4:07 PM IST
House Owner Against Corona Patients: కరోనా పేషంట్లపై వివక్ష చూపుతోన్న ఇంటి యజమానులు
X

House Owner Against Corona Patients: కరోనా పేషంట్లపై సమాజంలో వివక్ష కొనసాగుతోంది. పేషంట్లతో పాటు వారి కుటుంబసభ్యులను ఇళ్లల్లోకి రానివ్వకుండా మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇలాంటి ఓ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. దుబ్బవాడలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలగా వెంటనే వైద్యులు జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తికి లక్షణాలు లేకపోవడంతో వైద్యులు వెంటనే ఆ రోగిని మెట్ పల్లికి తిరిగి పంపించారు.

కరోనా సోకిన వ్యక్తి అద్దె ఇంట్లో ఉండడంతో ఇంటి యజమాని ఆ వ్యక్తిని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో కరోనా సోకిన వ్యక్తిని తీసుకువచ్చిన అంబులెన్స్ ను సుమారు గంటన్నరపాటు ఇంటి ముందు రోడ్డుపైనే ఉంచాల్సి వచ్చింది. కరోనా పేషంట్ ను మరోచోట ఉంచేందుకు గదుల కోసం వెతికినా గదులు దొరకకపోవటంతో మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మున్సిపల్ అధికారులు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story