Coronavirus updates in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 1,811 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Updated on: 30 July 2020 11:10 AM IST
Coronavirus updates in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 1,811 కరోనా పాజిటివ్ కేసులు
X
corona

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,811 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60,717కి చేరింది. మృతుల సంఖ్య 505కి పెరిగింది. కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 44,572కి చేరింది. ప్రస్తుతం 15,640 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 18,263మంది నమూనాలను పరీక్షించగా, 1,811 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,16,202 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా రంగారెడ్డిలో 289, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 151, వరంగల్‌లో 102, నల్లగొండలో 61 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 73.4 శాతంగా ఉందని, మరణాల రేటు 0.83 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, సీబీ నాట్ కరోనా పరీక్షా కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story