Telangana News: రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు అత్యధిక విద్యుత్‌ వినియోగం..!

Electricity Consumption: రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు విద్యుత్‌ వినియోగం అత్యధికంగా జరిగిందన్నారు టీఎస్‌ ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు.

Arun Chilukuri
Updated on: 28 Feb 2023 6:30 PM IST
Highest Power Consumption Recorded Today in History
X

Telangana News: రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు అత్యధిక విద్యుత్‌ వినియోగం..!

Electricity Consumption: రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు విద్యుత్‌ వినియోగం అత్యధికంగా జరిగిందన్నారు టీఎస్‌ ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు. మధ్యాహ్నం 14,750 మెగావాట్ల విద్యుత్‌ అత్యధిక పీక్‌ డిమాండ్‌ నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్‌ వినియోగం పెరుగుతోందని.. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్‌ వినియోగం పెరుగుతుందన్నారు. మొత్తం విద్యుత్‌ వినియోగంలో 37శాతం వ్యవసాయరంగానికే కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొత్తం విద్యుత్‌ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఉందని తెలిపారు. ఈ వేసవిలో 16వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చే అవకాశముందని.. ఎంత డిమాండ్‌ వచ్చినా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు సీఎండీ ప్రభాకర్‌రావు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story