Secunderabad: అర్ధరాత్రి పీజీ ఉమెన్ హాస్టల్లోకి ఆగంతకులు.. బాత్రూమ్‌లోకి చొరబడి..

Secunderabad: ఓ దుండగుడిని పట్టుకుని చితకబాదిన విద్యార్థినులు

Jyothi
Published on: 27 Jan 2024 11:21 AM IST
High Tension At OU PG Hostel Secunderabad
X

Secunderabad: అర్ధరాత్రి పీజీ ఉమెన్ హాస్టల్లోకి ఆగంతకులు.. బాత్రూమ్‌లోకి చొరబడి..

Secunderabad: సికింద్రాబాద్‌లోని పీజీ ఉమెన్ హాస్టల్‌లో కలకలం రేగింది. ముగ్గురు దుండగులు హాస్టల్ బాత్రూమ్ కిటికీ అద్దాలు ధ్వంసం చేసి విద్యార్థినుల గదుల్లోకి ప్రవేశించారు. దీంతో హాస్టల్‌లోని విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. నిందితుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు విద్యార్థులు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేసి.. లోపలికి ప్రవేశించినట్లు విద్యార్థినులు తెలిపారు.

హాస్టల్‌ చుట్టూ సరైన వసతులు లేకపోవడంతో దుండగులు తరచూ ప్రవేశిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అసభ్యకరమైన సైగలు చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తమకు రక్షణ కరువైందంటూ హాస్టల్ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story