ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు

admin1
Updated on: 4 Nov 2019 10:38 AM IST
Highcourt
X
Highcourt

ఆర్టీసీ సమ్మెపై జరుగుతున్న విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7 న తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ ఎస్ కే జ్యోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్ ను తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ఇచ్చిన రిపోర్ట్‌ అర్ధరహితంగా ఉందని,కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని,హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్‌కు అసెంబ్లీలో మినిస్టర్‌ చెప్పిన వాటికి విరుద్ధంగా ఉన్నాయని ఈ నెల 6 లోపు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7 కు వాయిదా వేసింది.

admin1

admin1

Next Story