అడ్వకేట్ దంపతుల హత్యపై హైకోర్టులో విచారణ: పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయస్థానం

X
అడ్వకేట్ దంపతుల హత్యపై హైకోర్టులో విచారణ
Highlights
వామన్‌రావు దంపతుల హత్య కేసులో హైకోర్టు ప్రశ్న ల వర్షం కురిపించింది. వామన్‌రావు మరణ వాంగ్మూలం ఎందుకు రికార్డు...
Arun Chilukuri1 March 2021 12:15 PM GMT
వామన్‌రావు దంపతుల హత్య కేసులో హైకోర్టు ప్రశ్న ల వర్షం కురిపించింది. వామన్‌రావు మరణ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. న్యాయవాదుల హత్య కేసుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేట్ చేశారని ప్రశ్నించిన హైకోర్టు.. ఎంతమందిని మంథని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని అడిగింది. అయితే.. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను సాక్షులుగా గుర్తించామన్న ఏజీ.. ప్రత్యక్ష సాక్షులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నట్టు వివరించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు మార్చి 15కు వాయిదా వేసింది.
Web Titlehigh court inquired about the gathering of evidence in the lawyer couple case
Next Story