Top
logo

హేమంత్‌ కేసులో మరో నలుగురు అరెస్ట్‌

హేమంత్‌ కేసులో మరో నలుగురు అరెస్ట్‌
X
Highlights

ఇటీవలె హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి....

ఇటీవలె హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్టు చేయగా తాజాగా మరో నలుగురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతోపాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్‌ పాషా ఉన్నారు. ఈ క్రమంలోనే మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వర్లు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో 24న చోటుచేసుకున్న హేమంత్‌కుమార్‌ హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో పాటు మరో 12 మందిని హత్య జరిగిన మరుసటి రోజే గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి మృతుడు హేమంత్ కు సంబంధించిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్ లెట్, చైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. అయితే అవంతి తండ్రి లక్ష్మారెడ్డిని పోలీసులు చేసిన విచారణలో హేమంత్ ను చంపేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 30 లక్షలైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడినట్లు తేలిందని తెలిపారు. హేమంత్ హత్యలో అవంతి సోదరుడు ఆశీష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీసీపీ తెలిపారు. ఒక వేళ ఈ హత్య కేసులో ఏమైనా ఆధారాలు దొరికితే వారిపైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఇక పోతే హేమంత్‌ను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లి హత్య చేసిన విషయం తెలిసిందే. యుగంధర్‌ రెడ్డిని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కలిసి హేమంత్‌ అడ్డు తొలగించాలని అభ్యర్థించారు. దాని కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడమని తెలిపినట్టు సమాచారం. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు(52), ఎరుకల కృష్ణ(33), మహ్మద్‌ పాషా అలియాస్‌ లడ్డూ(32), ఐడీఏ బొల్లారం నివాసి, రౌడీషీటర్‌ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి హత్య చేయడానికి పక్కా ప్లాన్ చేసారు. దానికోసం రూ.10 లక్షల డీల్ మాట్లాడుని రూ.50 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.

Web Titlehemanth murder case Today police arrest another four accused
Next Story