Heavy Rains in Hyderabad: రాబోయే 3 రోజుల్లో హైదరాబాద్ లో భారీ వర్ష సూచన..

Heavy Rains in Hyderabad: రాబోయే 3 రోజుల్లో హైదరాబాద్ లో భారీ వర్ష సూచన..
x
Heavy Rains in Hyderabad
Highlights

Heavy Rains in Hyderabad: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Heavy Rains in Hyderabad: రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనావేస్తున్నారు. అదేవిదంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో శ‌ని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం పలు చోట్ల ఎడతెరపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, వనస్థలిపురం, హయత్ నగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, రామాంతాపూర్, మేడిపల్లి, ఉప్పల్‌, మూసాపేట్‌, వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ లమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

శనివారం అత్యధికంగా కూకట్ పల్లిలో 8.67 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. బండ్లగూడలో 8 సెంటీమీటర్లు, ఆర్‌సీ పురంలో 6.73, కూకట్ పల్లి బాలాజీ నగర్‌లో 8.35, నాగోల్‌లో 6.3, హఫీజ్ పేటలో 8.03, సరూర్ నగర్‌లో 6.4 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్‌లో 5.58, మియాపూర్‌లో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ య్యయి. బేగంపేట్ ఇదర ప్రాంతాల్లో పూర్తిగా వదర నీరు చేరుకుంది. ఇటు బోడుప్పల్ ప్రాంతంలోని కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీటితో పాటు డ్రైనేజ్ బ్లాక్ కావడంతో కాలనీలోకి నీరు పొంగి పొర్లుతుంది. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories