Heavy Rains in Hyderabad: రాష్ట్రరాజధానిలో కుండపోత వర్షం

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.

Sumitra
Published on: 23 July 2020 1:16 PM IST
Heavy Rains in Hyderabad: రాష్ట్రరాజధానిలో కుండపోత వర్షం
X
ప్రతీకాత్మక చిత్రం

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, జీడిమెట్ల, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లింగంపల్లి, మియాపూర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఉప్పల్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అదే విధంగా సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీజలమయమయ్యాయి. కంటోన్మెంట్ బోయినపల్లి, సికింద్రాబాద్ వారసిగూడ, బేగంపేట్ ఇదర ప్రాంతాల్లో పూర్తిగా వదర నీరు చేరుకుంది. ఇటు బోడుప్పల్ ప్రాంతంలోని కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షానికి అంబర్‌పేట్‌- ముసరాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో పాటు డ్రైనేజ్ బ్లాక్ కావడంతో కాలనీలోకి నీరు పొంగి పొర్లుతుంది. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 10అత్యధికంగా మెదక్ కుల్చారం హలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఆదిలాబాద్, వికారాబాద్, మంచిర్యాల, జనగాం, జిల్లాలో 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.




Sumitra

Sumitra

Next Story