Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

Telangana: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
x
Highlights

హైదరాబాద్‌లో నీటి మునిగిన 250కాలనీలు 12జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ నెలరోజుల వాన ఒక్కరోజులో కురిసిందన్న వాతావరణశాఖ

Telangana: తెలంగాణలో రెండు, మూడు రోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు వాగులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పోర్లాయి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. చెట్లు కూలిపోయాయి. పాత ఇళ్లు కూలాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లోకి నీళ్లొచ్చాయి.

భారీ వర్షాలకు పంటలు నాశనం అయ్యాయి. ఇటీవల నాట్లేసిన వరి చేలు, మొక్కజొన్న, కంది, పత్తి, కూరగాయలు పంటలు నీట మునిగాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. చెరువులు కుంటలు మత్తడి దుంకుతున్నాయి.

తెలంగాణలో రాగల రెండు, మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories