Telangana: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

Sandeep Reddy
Updated on: 30 Aug 2021 11:20 AM IST
Heavy Rains in Telangana More Three Days 30 08 2021 to 02 09 2021
X

భారీ వర్షాలు (ఫైల్ ఫోటో)

Heavy Rains: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసా తీరంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా చండూరులో 9.10, పుల్లెంలలో 8.90, యాచారంలో 7.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story