Mancherial: భారీ వర్షాలతో గర్బిణీకి అవస్థలు.. కల్వర్టు కొట్టుకుపోవడంతో.. 108 నుంచి దించి గర్బిణీని కల్వర్టు దాటించిన కుటుంబీకులు

Mancherial: కల్వర్టు అవతల నుంచి మరో 108 వాహనంలో తరలింపు

Shekhar G
Updated on: 23 July 2023 7:46 PM IST
Heavy Rains In Mancherial District Pregnant Women Are At Risk
X

Mancherial: భారీ వర్షాలతో గర్బిణీకి అవస్థలు.. కల్వర్టు కొట్టుకుపోవడంతో.. 108 నుంచి దించి గర్బిణీని కల్వర్టు దాటించిన కుటుంబీకులు

Mancherial: భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాలు నిండా మునిగాయి. వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఉప్పొంగిన వాగులతో కల్వర్టులు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలకు వైద్యం అందడం నరకంగా మారింది.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మల్లంపేట అటవీ ప్రాంతంలో నడి రోడ్డుపై నిండు గర్బిణీ అవస్థలు పడింది. భారీ వర్షాలకు మల్లంపేట నీల్వాయి ప్రధాన రహదారిపై గల కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. వేమనపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో కల్వర్టు వదరలకు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆ గర్బిణీ 108 వాహనం నుండి దించి నడిపించుకుంటూ రోడ్డు పక్కనుండి అటవీ మార్గం గుండా కల్వర్టు దాటించారు. విషయం తెలుసుకుని కోటపల్లి 108 సిబ్బది అక్కడికి చేరుకుని ఆ గర్బిణిని మరో 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story