Mancherial: మంచిర్యాలను ముంచెత్తిన వర్షాలు.. గర్భిణీ స్త్రీల వార్డు లోకి వరద నీరు
Mancherial: ఆస్పత్రి వార్డులను సందర్శించిన కలెక్టర్ బడావత్ సంతోష్
Mancherial: మంచిర్యాలను ముంచెత్తిన వర్షాలు.. గర్భిణీ స్త్రీల వార్డు లోకి వరద నీరు
Mancherial: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కురిసిన భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోని పలు వార్డులోకి వరద నీరు చేరింది. దీంతో వైద్య శాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్, గర్భిణీ స్త్రీల వార్డు, చిల్డ్రన్స్ లోకి వరద నీరు చేయడంతో రోగులు వారి బంధువులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాసుపత్రిలోకి వరద నీరు చేయడంతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించి హాస్పటల్ ను సందర్శించారు.
వర్షంతో తలెత్తిన స్థితిగతులను ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి హాస్పిటల్ లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.




