Heavy Rains in Hyderabad: ఎల్‌బీనగర్‌, చింతకుంటలో దంచికొడుతోన్న వాన

* రోడ్లపై నిలిచిన వరద నీరు, వాహనదారుల ఇబ్బందులు * పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు, రాకపోకలకు జనం అవస్థలు

Sandeep Reddy
Updated on: 16 Oct 2021 7:00 PM IST
Heavy Rains in Hyderabad Today 16 10 2021
X

ఎల్‌బీనగర్‌, చింతకుంటలో దంచికొడుతోన్న వాన(ఫోటో: ది హన్స్ ఇండియా)

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది. ఎల్‌బీనగర్‌, చింతకుంట, ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. వనస్థలిపురం, కిస్మత్‌పుర, అత్తాపూర్‌తోపాటు రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పనామా చౌరస్తా దగ్గర రోడ్డుపై వాన నీరు నిలవడంతో ప్రజుల నానా ఇబ్బందులు పడ్డారు. రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story