logo
తెలంగాణ

హైదరాబాదీలకు అలర్ట్‌.. మరో 3 గంటల్లో భారీ వర్షం..

Heavy Rains for the Next Three Hours in Hyderabad
X

హైదరాబాదీలకు అలర్ట్‌.. మరో 3 గంటల్లో భారీ వర్షం..

Highlights

Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తుంది.

Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తుంది. అంతేకాదు రాబోయే మూడు గంటల్లో నగరంలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక జూలై నెలలోనే అతిపెద్ద వర్షమంటున్నారు వాతావరణ శాఖ. దీంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అంతేకాదు అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలంది వాతావరణ శాఖ.

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వర్షాలపై ప్రగతిభవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్‌శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు.


Web TitleHeavy Rains for the Next Three Hours in Hyderabad
Next Story