Weather Report: ఏపీ, తెలంగాణకు 5 రోజులు భారీ వర్ష సూచన

Dhivi
Published on: 22 March 2025 7:02 AM IST
Heavy rains in AP and Telangana today IMD urges vigilance
X

Heavy Rains: నేడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

Weather Report: చైనా నుంచి వస్తున్న భారీ మేఘాలు, ఇండియాలో పొగు అవుతున్నాయి. ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కి వస్తున్నాయి. అందువల్ల శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాపై ఉన్న దట్టమైన మేఘాలను బంగాళాఖాతంలోని గాలులు బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్ వైపు తీసుకువస్తున్నాయి. దాంతో ఇప్పుడు మేఘాలు, మధ్యప్రదేశ్ పై ఓ భారీ సుడిని ఏర్పరిచాయి. అంటే ఒక తుపాన్ తరహాలో ఏర్పడింది. ఈ మేఘాలు ఇప్పుడు ఏపీ, తెలంగాణకు వస్తున్నాయి. వీటి వల్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. తెలుగు రాష్ట్రాలపై ఒక ద్రోణి ఉంది. కానీ ఇది చాలా బలంగా ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్నాటక, లక్షద్వీప్ లో 5రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే వానలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని ఐఎండీ తెలిపింది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ పై ఉన్న తుఫాన్ వల్ల మేఘాలు, సమద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అదే సమయంలో ఈదురుగాలులు, చత్తీస్ గడ్, కర్నాటక, తెలంగాణపై వీస్తున్నాయి. వీటి వల్ల ఒక ద్రోణి సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఇది మేఘాలను పోగేస్తుంది. మరో ద్రోణి తమిళనాడుపై ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కూడా కనిపిస్తుంది.

ఈ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెద్దగా పడవు. కానీ మధ్యాహ్నం తర్వాత మొదలు అవుతాయి ముందుగా రాయలసీమ, కోస్తాలో వానలు మొదలై అలా పెరుగుతూ సాయంత్రానికి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కూడా కురుస్తాయి. రాత్రి 8 తర్వాత వర్షాలు తగ్గే అవకాశం ఉంది. నేడు కురిసే వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు ఉంటాయి.

Dhivi

Dhivi

Next Story