Heavy Rain Alert: హైదరాబాద్‌లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసే ఛాన్స్

Heavy Rain Alert: అత్యవసరం అయితేనే బయటకు రావాలన్న జీహెచ్ఎంసీ...

Shireesha
Published on: 9 Oct 2021 12:49 PM IST
Heavy Rain Alert in Hyderabad Today Afternoon | Weather Forecast Today
X

Heavy Rain Alert: హైదరాబాద్‌లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసే ఛాన్స్ 

Heavy Rain Alert: నిన్న రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వర్షాల నుంచి ప్రజలు తెరుకోక ముందే మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం పడనుందని తెలిపింది. దాంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపింది. అంతేకాదు.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యలయంలో సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు.. ప్రజలకు ఇబ్బంది ఉంటే 040- 2111 1111కి ఫోన్ చేయవచ్చని పేర్కొంది.

వాతావరణ పరిస్థితులతో పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

Shireesha

Shireesha

Next Story