Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు మళ్లీ భారీ వర్ష సూచన

Hyderabad Rain Alert: *ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం *బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో వర్షం

Shireesha
Published on: 13 Sept 2021 6:14 PM IST
Heavy Rain Alert in Hyderabad Today | Weather Forecast Today
X

హైదరాబాద్‌కు మళ్లీ భారీ వర్ష సూచన

Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ప్రకటించింది. ఉత్తర కోస్తా, ఒడిశా మధ్య ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఇదే సమయంలో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు.. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

Shireesha

Shireesha

Next Story